విద్యుత్ షాక్‌తో మృతి చెందిన దేవేందర్ కుటుంబానికి ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ పరామర్శ

విద్యుత్ షాక్‌తో మృతి చెందిన దేవేందర్ కుటుంబానికి ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ పరామర్శ

– మూడు వేల ఆర్థిక సహాయం అందజేసిన శ్రీనివాసరెడ్డి

రాయపర్తి అక్షిత ప్రతినిధి

మండలంలోని ఊకల్ గ్రామానికి చెందిన నర్ర దేవేందర్ విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో, రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపటి శ్రీనివాస్ రెడ్డి మృతుడి పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ తరఫున రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పూస మధు, పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి, మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, తాళ్లపల్లి సంతోష్ గౌడ్, కృష్ణమూర్తి అయ్యగారు, చందు రాము, సంకినేని ఎల్లస్వామి, స్థానిక నాయకులు బొడ్డు రంగయ్య, పెద్దోజు నరేష్, బిక్షపతి, గౌని అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking