పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్షా సమావేశం

పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్షా సమావేశం

– నవంబర్ 6లోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి 

– పారుపాటి శ్రీనివాసరెడ్డి

రాయపర్తి అక్షిత ప్రతినిధి 

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై రాయపర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి మారపెల్లి సుధీర్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 6వ తేదీ వరకు పట్టభద్రుల ఓటరు నమోదుకు అవకాశం ఉన్నందున అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు ఐత రామ్ చందర్, కర్ర రవీందర్ రెడ్డి, బందెల బాలరాజ్, ఎలామంచ శ్రీనివాస్ రెడ్డి, గాదె రవీందర్ రెడ్డి, ఆశ్రఫ్ పాషా, సంకినేని ఎల్లస్వామి, ఐత రవి, బండారి అశోక్, వివిధ గ్రామాల పార్టీ ఇన్‌చార్జిలు, గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking