బిగ్ చెస్ క్యాంప్ ప్రారంభం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలోని ఎంఆర్సిఆర్ స్మారక గ్రంధాలయంలో లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ డైమండ్ శ్రీను ఆధ్వర్యంలో చెస్ శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. వరప్రసాద్ ప్రధాన కోచ్ గా 7 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలకు చెస్ శిక్షణ ఇస్తారని డైమండ్ శ్రీను అన్నారు. చదరంగం అనేది పిల్లల మనోవికాసాన్ని పెంపొందింప చేస్తుందని, పిల్లలకు తమకు ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సైదులు, సబ్ కోచ్ రమేష్, లైబ్రేరియన్ కె.సుధాకర్, పిల్లలు, తల్లిదండ్రులు మిత్రులు శ్రేయోభిలాషులు పాత్రికేయులు పాల్గొన్నారు.