మమ్మల్ని తొలగించే హక్కు ఎవరిచ్చారు?

మమ్మల్ని తొలగించే హక్కు ఎవరు ఇచ్చారు

స్థంభాద్రి బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ నేతలు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

16 శాఖల అధ్యక్ష,కార్యదర్శుల జనరల్ బాడీ సమావేశం ఆమోదం లేకుండా పాత
భైలా నిబంధనలు ఉల్లంఘించి వెండి బంగారు వ్యాపారం లో 40 ఏళ్లుగా కొనసాగుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ లో ఉన్న 28 మంది సభ్యులను ఏకపక్షంగా తొలగించే హక్కు ఎవరు ఇచ్చారని స్థంభాద్రి బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ నేతలు వంకాయల శేఖర్ సుంకర నర్సింహారావు వెగ్గళం శ్రీనివాసరావు, భూమా సూర్యనారాయణ లు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు వచ్చే నెల 6న జరగనున్న నేపథ్యంలో మమ్ములను వెండి బంగారు అసోసియేషన్ నుంచి తప్పించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కనుసన్నల్లో ఉండే వ్యక్తికి పోటీ లేకుండా ఇనామస్ గా ప్రకటించే భాగంలోనిదే ఈ కుట్రపూరిత చర్య అని ఆరోపించారు.బంగారు అసోసియేషన్ లో ఉన్న మా సభ్యత్వాలను రెన్యూవల్ చేయాలని సభ్యులమైన మేము గత మార్చి 31 న డిడి రూపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరున రూ.70 వేలు చెక్కు రూపంలో పంపించామని అన్నారు.అట్టి చెక్కును డ్రా చేసుకుని,డబ్బు తీసుకున్నారు.కానీ సభ్యత్వాలు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మా సమస్యలను మేము స్వతహాగా పరిష్కారం చేసుకునేందుకు స్థంభాద్రి బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు జీర్ణించుకోలేక, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న వెండి,బంగారు శాఖల అసోసియేషన్ అధ్యక్షులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే కాకుండా, తమ చెప్పు చేతల్లో లేకపోతే అసభ్యకర పదజాలంతో దూషించి అవమాన పరుస్తున్నారని స్తంభాద్రి బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మా అసోసియేషన్ ఏకార్యం చేపట్టిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు తెలియకుండా చేయొద్దని హుకుం జారీ చేస్తూ ఆధిపత్యం చేలాయించడమేమిటని ధ్వజమెత్తారు.మా సభ్యత్వాలు తొలగించడంపై న్యాయస్థానం ను ఆశ్రయించి పోరాడతామని అన్నారు. ప్రస్తుతం ఉన్న అసోసియేషన్ నాయకులు, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో బి.లక్ష్మీ నారాయణ బి.సతీష్ జి.నాగశేషు నరేష్ జె.వెంకట్, ఉమేష్ రమేష్ రవికుమార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking