అక్రమ భవంతులు కూల్చివేత

 *అక్ర‌మ క‌ట్ట‌డాన్ని కూల్చిన

ఆధిభ‌ట్ల మున్సిప‌ల్ అధికారులు

అక్షిత వార్త‌కు స్పంద‌న‌

 

* అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చిన ఆదిభ‌ట్ల క‌మిష‌నర్  అమ‌రేంద‌ర్ రెడ్డి

రంగారెడ్డి, అక్షిత ప్ర‌తినిధి :  
అక్షిత ప‌త్రిక‌లో ఆధిభ‌ట్ల  మున్సిపాలిటీ ప‌రిధిలో అక్ర‌మ క‌ట్ట‌డాలు అనే శిర్షిక‌కు  మున్సిప‌ల్  క‌మిష‌న‌ర్ అమ‌రేంద‌ర్ రెడ్డి స్పందించారు.అక్ర‌మంగా అనుమ‌తులు లేకుండా నాగార్జున్ సాగ‌ర్  ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే బొంగ్లూరు ప‌రిదిలో నిర్మించిన  అక్ర‌మ క‌ట్ట‌డాన్ని  ఆదిభ‌ట్లటౌన్ ప్లానింగ్  అధికారులు క‌ట్ట‌డాన్ని కూల్చి వేశారు. ఎలాంటి అనుమ‌తులులేకుండా నిర్మాణాలు చేప‌డితే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. బ‌ఫ‌ర్ జోన్ లో క‌ట్టిన నిర్మాణాలు కూడ త్వర‌లో పూర్తిగాతీసేస్తామ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking