
వినాయక చవితి ఉత్సవాల్లో
యువనేత సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలో 20వ వార్డు- రెడ్డికాలనీలో ‘రెడ్డికాలనీ యూత్ ఉత్సవ కమిటి’ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా గణనాథుని మండపం వద్ద ఆరో రోజు నిర్వహించిన సహస్ర దీపాలంకరణ, రుద్రాభిషేకంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సిద్దార్ధ పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు సిద్దార్ధను ఘనంగా సన్మానించారు. సిద్దార్ధ వెంట కందగట్ల అశోక్, బండారు కుషలయ్య, పగిడిమర్రి సురేశ్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, షీలా శ్రీనివాస్, రేపాల అనంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.