అర్హులైన పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు

అర్హులైన పాత్రికేయులు అక్రిడేషన్ కార్డులు

రెండో విడత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహణ

జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.
సూర్యాపేట, అక్షిత బ్యూరో :
జిల్లాలో అర్హులైన పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ని తన ఛాంబర్ లో రెండో విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ విడతలో 306 మంది దరఖాస్తుల గాను 111 మంది దరఖాస్తులను పరిధిలోకి తీసుకొని ఆమోదించడం జరిగిందని అన్నారు. మిగతా దరఖాస్తులను ఈ నెల చివరినాటికి పరిశీలన చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఆదనవు పౌర సంబంధాల అధికారి ఏ. రమేష్, డి.ఈ మల్లేశం, కమిటీ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జి. శ్రీనివాస గుప్తా, వి. వీరయ్య, శ్రీనివాస్, ఐ .రాంబాబు, హాబీబ్, రాజీవ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking