అడబిడ్డలకు దసరా కానుకగా సర్కారు సారె
* మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ సర్కారు
* బతుకమ్మ చీరల పంపిణీతో నేతన్నల జీవితాల్లో వెలుగులు : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆడబిడ్డలకు దసరా కానుకగా సర్కారు సారె అందజేస్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్, ప్రకాష్ నగర్ కాలనీల్లో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు పాటుపడుతోందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 5.81 కోట్ల బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందన్నారు. ఈ మేరకు 339.73 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 24 డిజైన్లలో 10 రంగులు, 240 రకాల త్రెడ్ బోర్డర్లలో నేత కార్మికుల ద్వారా బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. చేనేత కార్మికులకు చేయూత…ఆడబిడ్డలకు చిరుకానుక అందజేయాలనే లక్ష్యంతో 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, మెప్మా టీపీఎం బక్కయ్య, కౌన్సిలర్లు రమావత్ కమిలీ భీమ్లా, కుర్ర చైతన్య విష్ణు, కొమ్మన నాగలక్ష్మి, పట్టణ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, మీసాల జగదీష్, శిరసన గండ్ల శ్రీకాంత్ చారి, తదితరులు పాల్గొన్నారు.