*తెలంగాణ రక్షణ సమితి వైపు ప్రముఖుల చూపు

*తెలంగాణ రక్షణ సమితి పార్టీలో ప్రముఖుల చేరికల సిద్దం

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

తెలంగాణ రక్షణ సమితి పార్టీలో తెలంగాణలోని 33 జిల్లాల నుండి ప్రముఖులు జాయిన్ కాబోతుండడం శుభ పరిణామంగా భావిస్తున్నాను.తెలంగాణ మేధావులు, యువజన విద్యార్థి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పార్టీలో ఎప్పుడెప్పుడు చేరాలనే ఉత్సాహాన్ని చూపడం
తెలంగాణ రక్షణ సమితి భవిష్యత్తులో బలమైన రాజకీయ శక్తిగా మారుతుంద నే నమ్మకం, విశ్వాసం కలుగుతున్నాయని నరాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.ఒక రాజకీయ పార్టీ ప్రకటనకు ముందే పెద్ద ఎత్తున మద్దతు తెలపడం తెలంగాణ చరిత్రలో ఇదే ప్రథమం అన్నారు.తెలంగాణలోని సబ్బండ వర్గాలు మద్దతు పలకడంతో పాటు 33 జిల్లాల నుండి పార్టీలో చేరాలని ఆసక్తి చూపుతుండడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు నిదర్శనంగా చెప్పవచ్చునని నరాల సత్యనారాయణ తెలియజేశారు.తెలంగాణ రక్షణ సమితిలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యమ్నయ పార్టీగా వస్తున్నాం అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking