టిఆర్ఎస్ పాలనలో పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయింది
-బీసీ జేఏసీ చైర్మన్ పాల్వంచ రామారావు ఆవేదన
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం చేపల మార్కెట్ ను అక్రమంగా కూల్చివేతను అడ్డుకుంటున్నారూ అనే నేపంతో జిల్లాకాంగ్రెస్ పార్టీనాయకుడు చోటేబాబాతో పాటు మరికొందరు నాయకులపై అక్రమకేసులు పెట్టడాన్ని బీసీ జేఏసీ బృందం తీవ్రంగా ఖండించింది చోటేబాబాను స్వగృహంలో కలిసి సంఘీభావం తెలిపిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చట్టబద్ధ పాలనలేదని కెసిఆర్ రాజ్యాంగమే అమలవుతుందని కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అధికార పార్టీ నేతలకు పాదాభివందనాలు చేస్తూ బానిసలుగా మారడంతో కిందిస్థాయిస్తిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతిని అన్యాయమని తెలిసి కూడా అధికారపార్టీవారు ఏదిచెప్తే అదేచేస్తున్నా దూషణలు అవమానాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు అధికారపార్టీ వారితోపాటు వారిమిత్రపక్షాలుకూడా బహిరంగంగానే తీవ్రపదజాలాలతో దూషిస్తున్నా నిస్సహాయస్థితిలో పోలీసువ్యవస్థ ఉందని గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగమంటే ప్రజలకు రక్షణ కల్పించేదని గౌరవముండేదని ఇప్పుడది అధికారపార్టీకి సలాం కొట్టి ఉద్యోగమని ప్రజలు భావిస్తున్నారన్నారు గతంలో పని సమర్థత ఆధారంగా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లను అధికారులు జరిపేవారిని ఇప్పుడు అధికార పార్టీవారు చెప్పినట్టు నడుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారన్నారు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు చిన్నపాటి పదవులున్న నాయకులకు మాజీలకు కూడా బందోబస్తుల పేరుతో అవసరాలకు మించి వారిఆడంబరాలు డంబాచారాలకోసం అధిక సిబ్బందిని ఉపయోగించడం వల్ల శాంతిభద్రతలు.
నేరాలమీద దృష్టి పెట్టే అవకాశం లేకపోవడంవలన అధికారపార్టీవారి అండతో విచ్చలవిడి బెల్ట్ షాపులు మద్యంఅమ్మకాలు గంజాయి మాదకద్రవ్యాలు గుట్కా ప్యాకెట్లు విచ్చలవిడిగా వినియోగించడం వలన హత్యలు ఆత్మహత్యలు భూకబ్జాలు దౌర్జన్యాలు మానభంగాలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయాయని గతంతో పోలిస్తే నేరాల సంఖ్య పెరిగిందని స్వయంగా రాష్ట్ర పోలీస్ భాసే ప్రకటించారంటే పరిపాలన ఏవిధంగాఉందో అర్థం చేసుకోవచ్చున్నారు.ఈ కార్యక్రమంలో పెరుగు వెంకటరమణ లిక్కికృష్ణారావు టీవీ రాజు గరిడేపల్లి సత్యనారాయణ వెంకటరామయ్య రవీంద్ర యాదవ్ అజీజ్ పాషా నాగుల్ మీరా తదితరులు పాల్గొని అక్రమ కేసులను తీవ్రంగా ఖండించారు.