దేశంలోనే ఆదర్శం… భరోసా కేంద్రాలు

*భరోసా కేంద్రాలు దేశంలో అదర్శంగా నిలుస్తున్నాయి.*
*అదనపు డిజిపీ స్వాతి లాక్ర*

వరంగల్, అక్షిత బ్యూరో : లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలికలకు మనోదైర్యాన్ని కలిగిస్తు బాసటగా నిలుస్తోందని స్వాతి లాక్ర తెలియజేసారు.
వరంగల్ భరోసా మరియు షీ టీం సంయుక్తంగా ఎర్పాటు ఎర్పాటు చేసిన ఇంటర్ కాలేజీ స్కిట్ కాంపిటిషన్ పోటీలను తెలంగాణ మహిళ రక్షణ విభాగం అదనపు డిజిపీ స్వాతి లాక్రా, వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి వరంగల్ కలెక్టర్ రాజీవ్ గాంధీ, వరంగల్ కలెక్టర్ గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి, కెయంసి ప్రిన్స్ పాల్ మోహన్ దాస్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హల్ నందు ఎర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో షీ టీం మరియు భరోసా కేంద్రం పనితీరుపై విధ్యార్థులకు అవగాహ కల్పించడంతో వివిధ కళాశాల విధ్యార్థులు రూపోందించిన లఘు నాటాకాలను ప్రదర్శించారు.
ఈ సందర్బంగా అదనపు డిజిపీ మాట్లాడుతూ మహిళ ల భద్రత కోసం ఎర్పాటు చేసిన షీ టీం మరియు భరోసా సెంటర్ల ద్వారా చక్కటి ఫలితాలు అందుతున్నాయని, దేశంలో ప్రతి జిల్లాలో భరొసా కేంద్రాన్ని ఎర్పాటు చేస్తే బాగుంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచన చేసిందని. లైంగిక దాడులకు గురైన మహిళ లకు పూర్తి స్థాయిలో సహకారాన్ని భాధితులకు న్యాయం కల్పిండం భరోస కేంద్రాలు కీలకంగా నిలుస్తున్నాయని. రాబోవు రోజుల్లో వరంగల కమిషనరేట్ పరిధిలో భరోసా కేంద్రాన్ని నూతన భవన నిర్మాణం చేపడటంతో జరుగుతుందని… యువకులు తమ ఇంటిలో మహిళలకు ఇచ్చే గౌరవాన్ని ఇతర మహిళ లకు ఇవ్వాలని.. అదే విధంగా సైబర్ నేరాలపై అదనపు డిజీపీ ప్రస్తావిస్తూ యువత ఇంటర్ నెట్ వినియోగ సమయంలో అప్రమత్తంగా వుందాలని, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని. సైబర్ నేరగాళ్ళ మోసాలను గురికాకుండా వుంటే ప్రతి ఒక్కరికి సైబర్ నేరాలపై అవగాహ కలిగి వుందాలని కాలేజీ యువతకు సూచించారు.
ఈ కార్యక్రమం డిసిపిలు వెంకటలక్ష్మి , అశోక్ కుమార్, అదనపు డిసిపి పుష్పారెడ్దితో పాటు ఎ.సి.పిలు, ఇన్స్ స్పెక్టర్లు ఎస్.ఐలు షీ.టీం మరియు బరోసా కేంద్రం సిబ్బంది పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking