ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు

ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు

హైదరాబాద్ అక్షిత బ్యూరో 

ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూ ల్గా మార్చేందుకు రాష్ట్రంలోనే తొలి పైలెట్ ప్రాజె క్టు కింద ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల ఉన్నత పాఠశాల ప్రారం భోత్సవానికి ముందే విశేష ఆదరణను చూరగొం టున్నది. సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇక్కడి పాఠశా లలో అమలవుతున్న కార్యక్రమాలకు ఫిదా అవుతు న్న తల్లి దండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. క్రీడా నైపుణ్యంతో పాటు విద్యా బోధనలో నాణ్యతను పెంచేందుకు ఇప్పటి వరకు రూ.10కోట్ల వరకు వ్యయం చేశారు. గతంలో ఇక్కడి పాఠశాలలో వి ద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండగా.. ఏడాదిగా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పబ్లి క్ స్కూల్ గురించి ఇక్కడి ఉపాధ్యాయులు విస్తృ తంగా ప్రచారం చేయడం కొంత కలిసొచ్చింది. స్కూల్ లో 1600 మంది విద్యార్థులను చేర్పించు కునేందుకు అవకాశం ఉండగా.. డిమాండ్ నేప థ్యంలో 1700 మందిని చేర్చుకున్నారు. అనంత రం చేసేది లేక ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking