కమీషనర్ ఆదేశాలు భేఖాతర్

కమీషనర్ ఆదేశాలు భేఖాతర్

యదేచ్ఛగా అక్రమ నిర్మాణం

బొంగులూరు గేట్ వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం అవుతున్న షెడ్డు

మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు బేఖతార్

రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి :
అక్రమ భవంతుల నిర్మాణానికి అడ్డు అదుపు లేదు. అనుమతులు లేకుండా నిర్మించే భవంతుల నిర్మాణం చేపట్టొద్దని స్వయంగా కమీషనర్ ఆదేశాలు జారీ చేసినప్పటికి తుంగలో తొక్కి యదేచ్ఛగా నిర్మాణాలు చేపడుతుండ్రు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగులూరు గేట్ వద్ద యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. బొంగులూరు గేటు వద్ద నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా ఒక షెడ్డు నిర్మాణం అవుతుంది. ఆదిభట్ల మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ అక్రమార్కులు మున్సిపాలిటీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోకుండా అక్రమ నిర్మాణ పనులు యదేచ్చగా కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం పై మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

* అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు

ఆదిభట్ల మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి

ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని , వెంటనే అక్రమ నిర్మాణం అవుతున్న షెడ్డు పనులు నిలిపివేయాలని, లేనియడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking