
కమలంలో అంతర్గత కలహాలు
బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్న నాయకులు
సీనియర్లకు సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలు
అసంతృప్తితో సీనియర్లు
మునుగోడు, అక్షిత ప్రతినిధి :
కొత్త పాతల కలయిక పొసగడం లేదు. కమలంలో అంతర్గత కుమ్ములాటలు. కొత్త, పాత అంతరాలతో విభేదాలు పొడచూపాయి. ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీలో అంతర్గత కొత్త, పాత నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాట జరుగుతున్నట్టు సమాచారం. మునుగోడులో ఇటీవల మునుగోడు మండల కేంద్రంలో జరిగిన బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ ఏర్పాటుచేసిన నియోజకవర్గం బూత్ , శక్తి కేంద్రం ఇన్చార్జిలకు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి సమాచారం లేకుండా ఎవరికి వారే యమునా తీరం అన్నట్లుగా కొత్తగా చేరిన రాజగోపాల్ రెడ్డి అనుచర వర్గం వ్యవహరిస్తున్నారు. బిజెపి మండల సీనియర్ నాయకులు వాపోతున్నారు పార్టీలో కొత్త వచ్చినవారు ఒక గ్రూప్ గా పాత వారు ఒక గ్రూప్ ఏర్పడి ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ ఉప ఎన్నిక ఆర్ధిక లావాదవీలతో ముడిపడి ఉండడంతో పార్టీ సిద్ధాంతాలు అనుసరిస్తూ సీనియర్లు పార్టీ విస్తరణ కోసం పాటుపడిన తమరిని ఇప్పుడు చేరిన నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏక పక్షంగా ప్రవర్తిస్తుండడంతో సీనియర్లు అసంతృప్తి తో ఉన్నట్లు లో లోపల మదన పడుతున్నారు. ఇలా జరగడానికి సీనియర్ల, జూనియర్లా మధ్య సరయిన సఖ్యత లేకపోవడమే కారణం. అంతర్గత కలహాలు ఇలాగే కొనసాగితే రాజగోపాల్ రెడ్డి చిక్కల్లో పడే ప్రమాదం ఉందని కావున ఇప్పటికైనా పార్టీ పెద్దలు ఎవరి ప్రాధాన్యత వారికి ఇస్తూ ప్రోటోకాల్ పాటిస్తూ అందరిని సమాన దృష్టితో పోతే పార్టీ విజయం ఖాయం అంటున్నారు.