ఆడబిడ్డలకు దసరా కానుకగా సర్కారు సారె

 ఆడబిడ్డలకు దసరా సారే
* బతుకమ్మ చీరల పంపిణీతో నేతన్నల జీవితాల్లో వెలుగులు : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆడబిడ్డలకు దసరా కానుకగా సర్కారు సారె అందజేస్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం ఆవరణలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు పాటుపడుతోందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 5.81 కోట్ల బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందన్నారు. ఈ మేరకు 339.73 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 24 డిజైన్లలో 10 రంగులు, 240 రకాల త్రెడ్ బోర్డర్లలో నేత కార్మికుల ద్వారా బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. చేనేత కార్మికులకు చేయూత…ఆడబిడ్డలకు చిరుకానుక అందజేయాలనే లక్ష్యంతో 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గం పూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు వీరకోటి రెడ్డి, జడ్పీటీసీ లలిత హాతిరాం, ఎంపీపీ నందిని రవితేజ, సీనియర్ నాయకులు యూసుఫ్, పడిగపాటి పెద కోటిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దారగాని వెంకటేశ్వర్లు, సర్పంచులు బంటు కిరణ్, లింగారెడ్డి, ఎంపీటీసీలు సోము సైదిరెడ్డి, బాలలక్ష్మీ సత్యనారాయణ, కొనకంచి సత్యనారాయణ, కందుల నాగిరెడ్డి, పడిగపాటి శ్రీనివాస్ రెడ్డి, కొండారపు బ్రదర్స్, మండల యువజన అధ్యక్షులు బైరం గోపి,రఫీ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking