గ్రామకంఠ భూమిలో అక్రమ ఇంటి నిర్మాణం
మునుగోడు, సెప్టెంబర్ 27 అక్షిత ప్రతినిధి :
కబ్జాకు కాదేది కనార్హం. అది గ్రామ కంఠం, శిఖం, పోరం బోకు, అసైన్డ్ తదితర ఏ భూమైనా… అది ప్రభుత్వ భూమి అయితే చాలు… ఖాళీ జాగా కన్పిస్తే కబ్జా చేసేయడమే. అధికార, అంగ బలం ఉంటే మరింత అలవోకగా కబ్జా చేసేస్తరు. ఇదే తంతుగా గ్రామ కంఠం భూమిని కబ్జా చేసి నిర్మాణాలకు ఉపక్రమించారు. అధికారులు మిన్నకుండి పోయారు. వివరాల్లోకి వెళ్తే…మoడల పరిధిలోని కొంపల్లి గ్రామపంచాయతీ ప్రధాన రహదారి పక్కన ఉన్న భూమిని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు గొల్ల కులస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతుండడంతో గ్రామంలో ఉన్న యాదవ కుల సంఘంకి స్మశాన వాటిక లేకుండా పోయింది గతంలో యాదవ కుల సంఘం పూర్వీకుల సమాధులు ఇక్కడ ఉన్నట్లు ఆసంఘం నాయకులు చెప్పినప్పటికీ కూడా డబ్బు అధికార మదంతో రోడ్డు వెంబడి ఉన్న భూమిని ఆక్రమించుకొని యాదవ కుల పూర్వీకుల సమాధులను కూల్చి ఇంటి నిర్మాణ పనులు చేపట్టి వారి వారిపై చర్యలు తీసుకొని గ్రామ కంఠ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు చొరవ తీసుకొని గ్రామ పంచాయతీకి అప్పగించగలరని గ్రామ ప్రజలు అధికారులు వేడుకుంటున్నారు.