క్రీడాకారులకు జెర్సీ బనియన్లు

క్రీడాకారులకు జెర్సీ బనియన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మిర్యాలగూడ, అక్టోబర్ 2 అక్షిత ప్రతినిధి :

దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో ఈ నెల 3 నుండి ప్రారంభం కానున్న గ్రామ స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనె మొత్తం 17 జట్టుల క్రీడాకారులకు జెర్సీ బనియన్లను స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్ధ పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పంపిణీ చేస్తు యువత క్రీడల్లో ముందుండాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, పత్తిపాటి నవాబ్, లెనిన్, చిన్నారి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking