ఆలయాల్లో అర్చకుల పాత్ర కీలకం

ఆలయాల అభివృద్ధిలో అర్చకుల పాత్ర ప్రధానం

టిటిడి బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :

ఆలయాల అభివృద్ధిలో అర్చకుల పాత్ర ప్రధానమైనదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ సప్తగిరి కాలనీలోని సాయిబాబా దేవాలయంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు కుటుంబ సమేతంగా దేవి శరన్నవరాత్రుల పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం ఆవరణలో అర్చకులకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన శాశ్వత వసతి గృహాలు, వంటశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే అర్చకుల పాత్ర ప్రధానమైనది అన్నారు. ఇక్కడికి ఆలయ ప్రాంగణంలో ఉన్న పలు దేవాలయాల్లో అర్చకులు నిత్యం సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking