*జాతీయ మహాసభలను జయప్రదం చేయండి*
*సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తెల నారాయణరెడ్డి*
చింతలపాలెం, అక్షిత న్యూస్ :
అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్తెల నారాయణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆవిష్కరించారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ, నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామస్థాయి నుండి కమిటీలు ఏర్పరచుకొని జాతీయస్థాయి మహాసభలకు విజయవాడ వేదిక కానుంది. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతోన్మాదం ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ, లాభపడాలని చూస్తున్నది. ఇటువంటి తరుణంలో వాటన్నిటిని తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్య లౌకిక శక్తులను ఏకం చేసేందుకు విజయవాడలో జరిగే 24వ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయి అని అన్నారు. ఈ మహాసభలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రపంచ దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలు పాల్గొంటున్నారని తెలిపారు. విజయవాడలో జరిగే జాతీయ మహాసభలకు చింతలపాలెం మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చింతిరాల రవి గ్రామ శాఖ కార్యదర్శి దొంగల అంకరాజు చిత్తలూరి వీరబాబు షేక్ జియాలుద్దీన్ తోకల సైదులు శ్రీనివాస్ మాతంగి రామయ్య గంధం రమేష్ సిహెచ్ కొండలు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.