*తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి….
వరంగల్/పాలకుర్తి, అక్షిత ప్రతినిధి :
పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే, మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆడపడుచులు అందరికీ, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మహిళలకు మంత్రి సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఒక్కరూ పండగని ఆనందోత్సాహాల మధ్య తగు జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. రూ.339.73 కోట్లతో కోటికి పైగా మహిళలకు వివిధ డిజైన్లలో చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి ఓ తండ్రిలా, పెద్దన్నలా సీఎం కెసిఆర్ చీరలు, సారెలతో పండుగలను గొప్పగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. మహిళలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.