మండల పరిషత్ లో గాంధీ జయంతి
మిర్యాలగూడ, అక్టోబర్ 2 అక్షిత ప్రతినిధి :
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జెడ్పిటిసి తిప్పన విజయసింహారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు నాయక్ ,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు జి ఏడుకొండలు, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, పిఆర్ఏ ఆదినారాయణ, ఎంపీఓ టీ.వీరారెడ్డి, సూపరింటెండెంట్ పి. కరుణాకర్ రావు, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ భరద్వాజ్, ఉపాధి హమీ సిబ్బంది పాల్గొన్నారు.