గాంధీకి నివాళులర్పించిన ఎమ్మేల్యే భాస్కరరావు
మిర్యాలగూడ, అక్టోబర్ 2 అక్షిత ప్రతినిధి :
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక సాగర్ రోడ్డులోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ మహనీయులు చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి సాధించిన గాంధీని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో రైస్ మిల్లులో అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు గౌరు శ్రీనివాస్,జి.శ్రీనివాస్, భోగవెల్లి వెంకటరమణ చౌదరి, కోశాధికారి పైడిమరి సురేష్, రేపాల రమేష్, గుడీపాటి సైదులు బాబలుపాల్గొన్నారు.