దసరా ఉత్సవాలకు హాజరు కావాలని ఎమ్మెల్యే భాస్కర్ రావుకు ఆహ్వాన పత్రికను అందజేసిన హిందూ ఉత్సవ కమిటీ
మిర్యాలగూడ, అక్టోబర్ 2 అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో ప్రతి ఏటా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు దసరా ఉత్సవాలను అంబరాన్ని తాకేలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పార్టీలకు అతీతంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలంతా తమ సమైక్యతను చాటేలా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, దసరా పండుగ సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు హాజరై అమ్మవారి అనుగ్రహం పొందాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో యెడవల్లి శ్రీనివాస్ రెడ్డి, చిలుకూరి శ్యాం, నాగేంద్ర చారి, ఎలుగుబెల్లి నాగరాజు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.