మిర్యాలగూడలో ఘనంగా దీపావళి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణం, మండలంలో సోమవారం ఘనంగా దీపావళి పండుగను ప్రజలు జరుపుకున్నారు. ప్రతి ఇంటా మహిళలు ప్రమిదల, విద్యుత్ దీపాలతో అలంకరించారు. పిల్లలు, టపాకాయలు పేల్చారు. టపాకాయల ధ్వనులతో దద్దరిల్లింది. ఉదయం నుంచి ప్రజలు దేవాలయాల్లో పూజలు చేశారు. స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కుటుంబ సభ్యులతో శాఖపురంలో పండుగ చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక మునిసిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ సతీ, తల్లి సమేతంగా, ఎంపిపి నూకల సరళ హన్మాంతరెడ్డి కుటుంబ సభ్యులు, డిఎస్పి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మీ కుటుంబ సభ్యులు, మునిసిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు కుటుంబ సభ్యులతో బాణ సంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.