క్రీడలతో శరీర దారుఢ్యం

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 22న స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్స్ సోమవారం ఫైనల్ నిర్వహించారు. టోర్నమెంట్స్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48 జట్లు పాల్గొన్నాయి. సోమవారం జరిగిన ఫైనల్లో మొదటి విజేతకు (మిర్యాలగూడ జట్టు) రూ.20,000 నగదు, కప్ ద్వితీయ విజేతకు (హుజూర్నగర్ జట్టు) రూ15,000 నగదు, కప్ తృతీయ విజేతకు (బి ఎల్ ఆర్ బుల్లెట్స్) రూ.12,000 నగదు కప్ చతుర్ద విజేతకు (దీర్శించర్ల) రూ.10,000 నగదు, కప్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ లక్ష్మారెడ్డి అందజేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక సేవలందిస్తున్న‌ బిఎల్ఆర్ యువత‌పెడమార్గంలో‌పడకుండా టోర్నమెంట్ నిర్వహించడం హర్షనీయమన్నారు. త్వరలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు బిఎల్ఆర్ నిర్వహించాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి బెజం సాయి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి లావూరి రవి నాయక్ క్రికెటర్ జానీ గంధం రామకృష్ణ ఆర్టీసీ డిపో మేనేజర్ పాల్ అడవిదేవులపల్లి సర్పంచ్ మరిరెడ్డి పీఈటి వెంకటేశ్వర్లు పీఈటి వెంకటరత్నం పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking