తెగుళ్లు, వర్షాల బారిన పడి నష్టపోయిన ప్రత్తి, మిర్చి రైతులను ఆదుకోవాలి
*ఎఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మట్టయ్య
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దామరచర్ల కళ్లేపల్లి గ్రామంలో పత్తి, మిర్చి పంటలను పరిశీలించి రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య మాట్లాడుతూ రైతులు పత్తి విత్తనాలు పెట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు పత్తి విత్తనాలు పెట్టినప్పుడు వర్షాలు లేక, విత్తనాలు మొలవక రైతులు ఇబ్బంది పడితే నేడు వర్షాలు తీవ్రంగా వచ్చి పూత రాలిపోయి చెట్టుకు 4, 5 కాయలు పడక ఎకరానికి 2.3 క్వింటాలు దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ సమయంలోనే ఎర్ర భీముడు తెగుళ్లు వచ్చి పూత కాయ ఎండి పోతున్నాయన్నారు. అక్కరకు రాని ఏఏఓ, ఏఇఓలు గ్రామాల వైపు వెళ్లి పంటలని పరిశీలించే పరిస్థితి లేదన్నారు గ్రామాలలో రైతులను వ్యవసాయ అధికారులు గ్రామాలకు రావడం లేదా అడిగితే వాళ్ళు ఎట్లా ఉంటారన్నారు. కల్తీ పత్తి విత్తనాలు కొని రైతులు నష్టపోయినారన్నారు. మిర్చి పంటకు కొమ్ము కుండు తెగుళ్లు వచ్చి ఎండి పోతున్నాయ ని రైతులు ఆవేదన చెందు తున్నారన్నారు. మండల వ్యవాయాధికారులు రైతులకు అందుబాటులో లేకుండా ఆఫీస్ లకే పరిమితమై జీతాలు తీసుకుంటున్నారన్నారు. అక్టోబర్ 28, 29న ఏడీఏ, ఎంఏఓ ఆఫీస్ ల ముందు ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరుగుతుందని రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షులు దీరావత్ మోహన్ నాయక్, జిల్లా నాయకులు రామచంద్రయ్య , వీరయ్య , కార్తీక్ రైతులు పాల్గొన్నారు.