ఏడుళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ని సందర్శించిన… రేగా

ఏడుళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ని సందర్శించిన… ప్రభుత్వ విప్ రేగా

పినపాక, అక్షిత ప్రతినిధి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడుళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్టేషన్ పరిసర ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రము ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ అభివృద్ధితోపాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ పై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా నిర్మించుకుంటున్నామన్నారు. అదేవిధంగా నూతనంగా పోలీస్ స్టేషన్ లో నిర్మిస్తున్న పనుల వివరాలను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాల గురించి తదితరు అంశాలు చర్చించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking