ప్రమాదం జరగటం బాధాకరం…
ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన శరీరాలను స్వయంగా హాస్పిటల్ కు తరలించిన విప్
-మానవత్వం చాటుకున్న మహా మనిషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
పినపాక, అక్షిత ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట ఏటునాగారం ప్రధాన రహదారి అక్కినేపల్లి మల్లారం వద్ద లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పేరూరు నుండి బైక్ పైన అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామానికి చెందిన పిట్ట వెంకట సాయి రెడ్డి 20, భద్రాచలం ఆదర్శనగర్ చెందిన పిట్ట వీరరాజారెడ్డి 50 రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ హుటా హుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం వివరాలను తెలుసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్వయంగా తానే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల కోసం నిరంతరం తాపత్రయపడే విప్ రేగా కాంతారావు దగ్గర ఉండి మృతదేహాలను పంపించే వరకు అక్కడే ఉండి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.