భద్రాచలంకు శ్రీరామరక్షగా కరకట్ట

భద్రాచలంకు శ్రీరామ రక్షగా కరకట్ట

-గోదావరి జలప్రళయానికి అడ్డుకట్టగా నిలిచిన కరకట్ట

-నాడు చంద్రబాబు పాలనలో నిర్మాణం చేసిన కరకట్ట

-నాటి ఇరిగేషన్ మంత్రిగా కరకట్ట నిర్మాణంలో తనదైన ముద్ర వేసిన తుమ్మల

షేక్ సయ్యద్ ఖాసీం
భద్రాద్రి/ అక్షిత బ్యూరో :

గోదావరి జలప్రళయం అనగానే చరిత్రలో అతిపెద్ద విపత్తుగా నిలిచింది 1986.అప్పట్లో 75.6 అడుగుల ఎత్తులో జలరాకాసిలా వందలాది లంక గ్రామాలను భద్రాచలాన్ని ముంచేసింది.ఎంతో ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది. అప్పటి చేదు జ్ణాపకాలు ఇంకా మరిచిపోక ముందే మళ్లీ నాటి జలప్రళయంలా గోదావరి ముంచేస్తదేమో అనే భయం వెంటాడినా భద్రాచలం వాసులు మాత్రం ధైర్యంగా ఉన్నారంటే కారణం కరకట్ట.నాటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు పాలనలో నాటి మంత్రి తుమ్మల పట్టుదలతో నిర్మాణం చేసిన కరకట్ట గోదావరి జలప్రళయాలకు అడ్డుకట్టగా నిలిచి భద్రాద్రి కి శ్రీరామ రక్షగా నిలిచింది కరకట్ట.అది 1986 సంవత్సరం అగస్ట్ నెల ఎన్నడు లేని విధంగా గోదావరి మహోగ్రరూపంతో 75.6 అడుగుల ఎత్తులో ఉప్పోంగుతూ వందలాది గ్రామాలను ముంచెత్తుతూ భద్రాచలాన్ని చుట్టుముట్టింది.దాంతో ఇళ్లన్ని వరద నీటిలో చిక్కగా రామాలయం చుట్టుపక్కల పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఆ విపత్తు తలుచుకుంటేనే భద్రాచలం వాసులకు వెన్నులో వణుకు పుడుతుంది.అప్పటి జలప్రళయం తో వందలాది లంక గ్రామాల్లో ప్రాణ అస్తి నష్టం పంట నష్టంతో పాటు వేలాది పశువులు జలసమాధి అయ్యాయి.నాటి జలప్రళయంతో అల్లాడిపోతున్న బాధితులకు భరోసా గా నాటి ప్రధాని రాజీవ్ గాంధీ నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వరద ప్రభావిత మండలమైన వీఆర్.పురంలో పర్యటించి చలించిపోయారు.గోదావరి జలప్రళయానికి శాశ్వాత పరిష్కారం ఎలా అని ఎన్టీఆర్ ఆలోచన చేశారు.

*చంద్రబాబు పాలనలో భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణం*

1986 లో గోదావరి జలప్రళయంతో భద్రాచలం పట్టణం నీట మునగడం దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాచలం రామాలయం వరద నీటిలో చిక్కడంతో అప్పటి పరిస్థితులను కళ్లారా చూసిన జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్ రావు మైనర్ ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్నారు. గోదావరి జలప్రళయానికి శాశ్వత పరిష్కారం కోసం భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణంతోనే గోదావరి వరదలకు అడ్డుకట్ట వేయోచ్చనే సంకల్పంతో తుమ్మల కరకట్ట నిర్మాణం ఆవశ్యకతను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.చంద్రబాబు రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక కరకట్ట నిర్మాణం చేయాలనే ప్రపోజల్ తో చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు.ఎంతో విజనరీ లీడర్ గా ఉన్న చంద్రబాబు వెంటనే కరకట్ట నిర్మాణం చేయాలని నిధులు కెటాయించడంతో అపుడు ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్న తుమ్మల ఎంతో పట్టుదలతో 2002 లో కరకట్ట నిర్మాణం పూర్తి చేశారు.

*8 జలప్రళయాలకు అడ్డుకట్టగా నిలిచిన కరకట్ట*

.1986 నాటి గోదావరి జలప్రళయాలు చూసిన భద్రాచలం వాసులకు ఎలాంటి వరద నీటి ముంపు గండం లేకుండా కరకట్ట అడ్డుకట్టగా నిలిచింది.కరకట్ట నిర్మాణం తర్వాత గోదావరి మహోగ్ర రూపంగా ప్రవహించిన గణాంకాలు సెంట్రల్ వాటర్ కమీషన్ సీ.డబ్ల్యు.సీ లెక్కలు చూస్తే ఇపుడు వచ్చిన భారీ వరదలతో కలిపి ఇప్పటికీ 8 సార్లు కరకట్ట అడ్డుకట్టగా నిలిచింది.కరకట్ట నిర్మాణం తర్వాత భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు దాటి గోదావరి మహోగ్రంగా ప్రవాహించడం ఇపుడు ఎనిమిదో సారీ.

సంవత్సరం గోదావరి ప్రవాహం అడుగుల్లో

1.2005 54.9
2.2006 66.9
3.2007 53.7
4.2010 59.7
5.2013 61.6
6.2014 56.1
7.2020 61.6
8.2022 71.3

…..భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణం తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక దాటి మహోగ్రంగా గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవాహించినా భద్రాచలం పట్టణం సురక్షితంగా ఉంది.గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారంగా ఎంతో ముందు చూపున్న చంద్రబాబు కరకట్ట నిర్మాణం కోసం 53 కోట్లు నిధులు కెటాయించగా ఎటపాక నుంచి భద్రాచలం చుట్టూ వలయాకారంలో నిర్మాణం చేశారు.అపుడు ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్న తుమ్మల కరకట్ట నిర్మాణ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోని పనులను స్వయంగా పర్యవేక్షణ చేస్తూ నిర్మాణం చేయడం వల్లే 8 సార్లు మూడో ప్రమాద హెచ్చిరిక దాటి గోదావరి ఉప్పొంగినా కట్ట తట్టుకొని నిలిబడింది.ఒకవేళ కట్ట నాణ్యత విషయంలో రాజీ పడితే ఎక్కడ కట్ట తెగినా గోదావరి జలప్రళయంతో భద్రాచలం లో నాటి 1986 నాటి జల విలయం కనపడేది.
గోదావరి వరదల నుంచి మాకు శ్రీరామ రక్షగా నిలిచిన కరకట్ట నిర్మాణం చేసిన చంద్రబాబు తుమ్మల మా పాలిట దేవుళ్లని ముంపు ప్రాంతాల వారి మాటల్లో అంతులేని భావోద్వేగం అభిమానం

భద్రాచలం వద్ద గోదావరి వరద పురిస్థితిని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ భద్రాచలం రాగా మాజీ మంత్రి తుమ్మల భద్రాచలం వచ్చారు. కరకట్ట వద్ద గోదావరి మహోగ్ర ప్రవాహం పరిశీలించేందుకు తుమ్మల కరకట్టకు వెళుతుంటే వందలాది మంది మీరే మా పాలిట దేవుడంటూ అభిమానంతో రెండు చేతులు ఎత్తి నమష్కారం చేస్తుంటే తుమ్మల భావోద్వేగానికి లోనైయ్యారు.కరకట్ట వద్ద మాట్లాడుతూ …పదవులు శాశ్వతం కాదు చేసిన పనులే శాశ్వతం అని చెప్పడానికి కరకట్టే నిదర్శమని ,భద్రాచల శ్రీరాముని ఆశీస్సులతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహాంతో కరకట్ట కట్టే భాగ్యం దక్కిందని,ఇవాళ జల విలయం నుంచి కాపాడే శ్రీరామ రక్షగా కరకట్ట మారడం చూస్తుంటే ఇంతకంటే ప్రజాసేవ చేసే భాగ్యం ఏముంటుందని తుమ్మల ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
1986 నాటి గోదావరి జలప్రళయం మరువక ముందే మళ్లీ నాటి జల విలయం వస్తుందేమో అనే భయాందోళనకు గురైన భద్రాద్రి వాసులకు కరకట్ట శ్రీరామరక్షగా నిలవగా భద్రాచలంలో రామాలయం నిర్మాణం చేసి భక్త రామదాసు చరిత్రలో నిలిచిపోతే కరకట్ట నిర్మాణంతో అభినవ భక్తరామదాసులుగా తుమ్మల చరిత్రలో నిలిచారని భద్రాద్రి వాసులు గుండెల నిండా ఉప్పొంగే అభిమానం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking