మోడీ పాలనకు చరమగీతం పాడుదాం

మోడీ పాలనకు చరమగీతం పాడుదాం

అడవిదేవులపల్లి,అక్షిత ప్రతినిధి :

దామరచర్ల అడవిదేవులపల్లి గత అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ నియంత పాలనకు అంతం పలికిన విధంగానే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలలో మోడీ పాలనకు చరమగీతం పాడాలని నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. ఆదివారం దామరచర్ల అడవిదేవులపల్లి మండలాలలో మాజీ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖుల వారసత్వాన్ని నిలబెడతానని నియోజకవర్గ సమస్యలు పార్లమెంటులో ప్రస్తావించి జిల్లా మంత్రుల ఎమ్మెల్యేల సహకారంతో నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

భారతదేశ ప్రజాస్వామ్యం మునుపేన్నడు లేనంత ప్రమాదంలో పడిందని నిరుద్యోగం పేదరికం అధిక ధరల పెరుగుదలకు కారణమైన బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజా సంక్షేమ పాలన కొరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రఘువీర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టినదని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.జానా రెడ్డి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అభివృద్ధి ప్రదాత కుందూరు జానారెడ్డి గత నాలుగు దశాబ్దాలుగా నల్గొండ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా వ్యవహరించిన జానారెడ్డి జిల్లాను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గత 15 సంవత్సరాలుగా జానారెడ్డి అడుగుజాడల్లో ప్రజాక్షేత్రంలో నిలిచిన నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు.

రఘువీర్  గెలుపుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ కోరారు కార్యకర్తలకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి రఘువీర్ రెడ్డి కృషి చేస్తారని ఆయన తెలిపారు కార్యక్రమంలో స్కైలాబ్ నాయక్ పొదిల శ్రీనివాస్ ఎంపీపీ నందిని రవితేజ సర్పంచ్ లు బంటు కిరణ్ చల్లా అంజిరెడ్డి అడవిదేవులపల్లి దామరచర్ల మండల పార్టీ అధ్యక్షులు బాలు నాయక్ గాజుల శ్రీనివాస్ గాలం వెంకన్న యాదవ్ ఘని జీడయ్య యాదవ్ కందుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking