రఘురాంరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం

రఘురాం రెడ్డిని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం

-సీపీఎం పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

-హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి పొంగులేటి

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డికి రాష్ట్రంలోని అన్ని స్థానల్లోకెళ్లా అత్యధిక మెజారిటీ రావడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో మంగళవారం నిర్వహించిన సీపీఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. లోకికవాదాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కు మద్ధతు పలికినట్లు తెలిపారు. గెలిచాక రఘురాం రెడ్డి ప్రతి కామ్రేడ్ కుటుంబానికి అండగా నిలుస్తారని తమ్మినేని అభయమిచ్చారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇండియా కూటమి సమష్టి లక్ష్యం కోసం కలిసి ముందుకుపోతున్నట్లు తెలిపారు.సీపీఎం నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నాయకులంతా వేదికపై అభివాదం చేసి జోష్ నింపారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking