ఓటర్ స్లిప్పుల పంపిణి షురూ
*ఆర్డీఓ శ్రీనివాస్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ స్లిప్పుల పంపిణి ప్రారoభమయిందని మిర్యాలగూడ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ జి. శ్రీనివాస్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 2,36,304 మంది పురుష, మహిళా ఓటర్లకు ఆయా పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవెల్ ఆఫీసర్ల (బిఎల్ఓలు)కు పంపిణి బాధ్యత ఇచ్చామని వారు ఇంటింటికి తిరిగి ఇస్తారని తెలిపారు. స్లిప్పులను ఓటర్లు మే 13వరకు భద్ర పర్చుకుని అందరు పోలింగ్ లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రధమ చికిత్స కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో వడదెబ్బకు గురి కాకుండ ఓఆర్ఎస్ పాకెట్ల పంపిణి చేస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ ఎన్.హరిబాబు, కార్యాలయ పరిపాలన అధికారి లక్ష్మి ఉన్నారు.