ఆత్మీయ మిత్రున్ని కోల్పోయాను…

ఆత్మీయ మిత్రున్ని కోల్పోయాను

ఎంపి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ, అక్షిత ప్రతినిధి : సర్పంచ్, ఎంపీటీసీలుగా రెండేసి పర్యాయాలు, కోదాడ మండల కాంగ్రేస్ పార్టీకి ప్రస్తుత అధ్యక్షుడిగా ప్రజలు మరువలేని సేవలు అందించిన నా ప్రియ మిత్రుడు పాలకి అర్జున్ రోడ్డుప్రమాదంలో అకస్మాత్తుగా మరణించడం నన్ను కుదిపి వేసిందని నల్గొండ ఎంపి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒక ఉత్తమ నాయకుడిగా, ఒక మంచి మనిషిగా, విలువలకు సిద్ధాంతాలకు కట్టుబడ్డ వ్యక్తిగా, కోదాడ ప్రాంత ప్రజల గుండెల్లో పాలకి అర్జున్ చిరస్థాయిగా నిలిచి పోతాడన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో చాలా అరుదైన గుణాలు, నిస్వార్థ ప్రజా సేవ, నూటికి నూరుశాతం నిజాయితీ పాలకి అర్జున్ కి స్వంతమన్నారు. గత 30ఏండ్లుగా నాకు ప్రియమిత్రుడిగా, ఆత్మీయుడిగా, సహచరునిగా, సలహా దారునిగా, శ్రేయోభిలాషిగా ఉన్న అర్జున్ ఇకలేరు అంటే నాకు నమ్మశక్యం కావడం లేదన్నారు. వారి ఆత్మకు శాంతికలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ ఎల్లపుడు నేను, నా సతీమణి పద్మావతి, అర్జున్ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అర్జున్ మరణం కాంగ్రెస్ పార్టీకి, నాకు తీరని లోటన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking