తాండూరులో ఘనంగా శుభప్రద్ పటేల్ జన్మదిన వేడుకలు
– ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపిన బిఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు
తాండూరు, అక్షిత ప్రతినిధి:
తాండూరు పట్టణంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం కింద స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరో హించాలని, ఆకాంక్షిస్తూ.. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభప్రద్ పటేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా సమాజానికి సేవ చేయడం అభినందనీయ మని కొని యాడారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్య త్తులో కూడా విద్య, వైద్యం, సామాజిక సేవలకు సంబంధించిన కార్య క్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని, స్పష్టం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని, ఆకాంక్షించారు.
హ్యాపీ బర్త్ డే శుభ ప్రద్ పటేల్
అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షల లేఖతో పాటు పుష్పగుచ్ఛాన్ని పంపించి అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు. కేటీఆర్, హరీష్ రావు చూపిన అభి మానానికి, ఆశీస్సులకు శుభప్రద్ పటేల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
