తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి
– పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ప్రత్యేక అర్చనలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా గంగుల రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సస్యశ్యామల పంటలతో ఆనందంగా జీవించాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పున్న జగన్ మోహన్, కాంగ్రెస్ డిసిసి జనరల్ సెక్రటరీ తిమ్మాపురం మహేందర్ కాంగ్రెస్ నాయకులు పిట్టే వెంకట్ రెడ్డి, శంభాల వెంకన్న,సన్నిహితులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం గంగుల రాజిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని ఆకాంక్షించారు