అలుగునూర్ లో గణనాధులను దర్శించుకున్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

అలుగునూర్ లో గణనాధులను దర్శించుకున్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ అక్షిత బ్యూరో

కరీంనగర్ పట్టణం 8వ డివిజన్ అలుగునూరు లోకొలువుదీరిన గణనాధులను మంగళవారం రాత్రి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. అల్గునూరులోని కౌండిన్య యూత్, విశ్వామిత్ర యూత్, మహాలక్ష్మికి గణపతి యూత్, లిటిల్ స్టార్స్ యూత్, మున్నూరుకాపు సంఘం, శ్రీ వెంకటేశ్వర కాలనీ శ్రీ పంచముఖ హనుమాన్ యూత్ ల ఆధ్వర్యంలో అల్గునూరులోనీ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వినాయకులను మేయర్ కోలగాని శ్రీనివాస్ దర్శించి, వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని మేయర్ ప్రార్థించారు ..ఈ పవిత్ర వేడుకలో భాగంగా ఆయా ప్రాంతాల నిర్వాహకులు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను సాదరంగా ఆహ్వానించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అలుగునూరులోని ఆయా ప్రాంతాల నిర్వాహకులతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధిబొంతల కళ్యాణ్ చంద్ర, బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు దుర్షెట్టి సంపత్, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి , బీజేవైఎం మండల అధ్యక్షులు గడ్డం అరుణ్ , ఓదెలు, బిజెపికంటెస్టెంట్ కార్పొరేటర్ తోర్తి సంతోష్ , వెల్పుల నరేష్ ముంజా ప్రశాంత్ బుర్ర నరేష్ ముంజా ప్రవీణ్ ,కార్లే వినయ్ కత్తి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking