ఉద్యమకారులకు న్యాయం జరిగేలా పోరాటం

ఉద్యమకారులకు న్యాయం జరిగేలా పోరాటం

– 27న ‘చలో యాదగిరిగుట్ట’ను విజయవంతం చేయాలి

– ఉద్యమకారుల ఫోరం

రామన్నపేట అక్షిత ప్రతినిధి

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి, వారికి న్యాయం జరిగేలా పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్యమకారుల ఫోరం నాయకులు తెలిపారు. ఈ నెల 27న ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో యాదగిరిగుట్ట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను మంగళవారం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని, 250 చదరపు గజాల స్థలం, రూ.25 వేల పింఛన్‌తో పాటు ఇతర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ‘చలో యాదగిరిగుట్ట’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఉద్యమకారులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ఎస్కే చాంద్, బందెల రాములు, రెబ్బాసు రాములు, మండల అధ్యక్షులు నోముల శంకర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, మండల నాయకులు చిందం లింగయ్య, గొలుసుల ప్రసాద్, మర్రి పరమేష్, ఏలూరి రవి, ఎండి అజార్, యాదాసు లక్ష్మణ్, ఆవుల నరేందర్, నంగునూరి విజయ్, బోయ సైదులు, కైరంకొండ సంతోష్, డాక్టర్ నకిరేకంటి అశోక్, డాక్టర్ కొండ మల్లేష్ గౌడ్, మందడి రవీందర్ రెడ్డి, మధ్యగల నర్సింహ, నక్క శంకరయ్య, ఎండి ఇమామ్, గడ్డం యాదగిరి, నర్రా అందాలు, శివరాత్రి లక్ష్మమ్మ, భీంపాక ఉమా, వంగాల యాదయ్య, జెట్టి శివప్రసాద్, ఆవుల లక్ష్మీనారాయణ, గర్దాస్ కరుణాకర్, రాస వెంకటేశం, లెంకల సత్యం, ఆళ్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking