తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి
కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి
కొమురవెల్లి అక్షిత న్యూస్:
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లో ఆదివారం కొమురవెల్లి మల్లన్న ను కిషన్ రెడ్డి తో పాటు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్,మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీలు పింగళి శ్రీపాల్ రెడ్డి, అంజిరెడ్డి రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ తో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కొమురవెళ్లి పుణ్యక్షేత్రం రైల్వే హల్ట్ స్టేషన్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరంకేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ లక్షలాది మంది మల్లన్న భక్తులు అనేక ఏళ్లుగా రైల్వే స్టేషన్ కావాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం వారి కోరికను నెరవేర్చిందన్నారు.కేంద్రం తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు కేటాయించిందన్నారు.తెలంగాణ అభివృద్ధి పట్ల మోదీ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతుఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని తెలిపారు.రెండేళ్లలో ఈ స్టేషన్ నిర్మించి స్వామి వారి సన్నిధిలో భక్తులకు అంకితంచేస్తున్నామనీ, దూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు. హైదరాబాద్ నుంచి కేవలం 20 రూపాయలతో ఇక్కడికి రావచ్చనీ, ప్రస్తుతం డీసిల్ తో నడుస్తున్న ఈ లైన్ ను త్వరలోనే 300 కోట్లతో విద్యుదీకరిస్తామని,ఇక్కడి నుంచి దేవాలయం వరకు శటిల్ బస్సులు నడపాలన్నారు.ఈ ప్రాంత రైతులకు, విద్యార్థులకు, వ్యాపారులకు తమ సరుకుల రవాణాకు ఎంతో ఉపయోగపడుతుందనీ.ఈ ఏడాది డిసెంబర్ 31 తేదీ లోగా సిరిసిల్ల కు రైలు ప్రారంభిస్తామనీ తెలిపారు.వచ్చే ఏడాది వేములవాడ, 2029 లోగా కొత్తపల్లి వరకు ఈ రైల్వే లైన్ పనులుపూర్తిచేస్తా మనీతెలిపారు.హైదరాబాద్ నుంచి యదాద్రి వరకు 500 కోట్లతో ఎంఎం టీ ఎస్ రైలు.రాష్త్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి ఇవ్వాలనీ.3500 కోట్లతో పాండురంగాపురం, భద్రాచలం పనులు పూర్తి చేయబోతున్నామని, తెలంగాణ లో ఏక కాలంలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.ఐదు వందేభారత్ ట్రైన్లను తెలంగాణకు ఇచ్చామన్నారు.కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందనీ.. వచ్చే ఏడాది దాన్ని ప్రారంభించుకో బోతున్నాం అని ఆయన చెప్పారు దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్లలో మూడు తెలంగాణాకు రాబోతున్నాయనీ తెలిపారు.5 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు బుల్లెట్ ట్రైన్ల ద్వారా జరుగుతోందనీ తెలంగాణ అభివృద్ధిలో ఈ మూడు బుల్లెట్ ట్రైన్లు గేమ్ చెంజర్ కాబోతున్నాయనీ.ట్రిపుల్ ఆర్ కు సంబంధించి త్వరలోనేమోదీశుభవార్తఅందిస్తారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.