కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం
కొమురవెల్లి అక్షిత న్యూస్:
కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చి ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని, అలాగే శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో చేర్చి యాత్రికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.అమృత్ భారత్ స్టేషన్ పథకంలో కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించి ప్రయాణికులకు అత్యాధుని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.మరిన్ని ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లు ఆగే అవకాశాలు పెరుగుతాయి.లక్షలాది మంది భక్తులు కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి సులభంగా చేరుకునే వీలు కలుగుతుంది.స్థానిక వ్యాపారులు,హోటళ్లు, రవాణా రంగం అభివృద్ధి చెందిఉపాధిఅవకాశాలు పెరుగుతాయి.కొమురవెల్లి ప్రాంతం రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందడంతో పాటు పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది.అదేవిధంగా ప్రసాద్ పథకంలో కొమురవెల్లి దేవస్థానాన్ని చేర్చడం ద్వారా ఆలయ పరిసరాల్లో రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, యాత్రికుల విశ్రాంతి గృహాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపడి భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది.కొమురవెల్లి ప్రాంత సమగ్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు మరియు స్థానిక ప్రజల ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఈ విజ్ఞప్తిఎంతోప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే అమలు చేయాలని స్థానిక ప్రజలు,భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కిషన్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేత
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.