రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీల నియామకం
రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఆదేశానుసారం, తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి గార్ల సహకారంతో రామన్నపేట మండల పరిధిలోని 24 గ్రామాల యువజన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులను నియమించినట్లు రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, యువతను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి యువజన కాంగ్రెస్ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా నియమితులైన గ్రామ కమిటీలు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.కొత్తగా బాధ్యతలు చేపట్టిన గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.