తెలంగాణ ఉద్యమకారులకు తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలి

తెలంగాణ ఉద్యమకారులకు తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలి

– కేకే కమిటీ పేరుతో కాలయాపన వద్దు

– ఉద్యమకారులకు న్యాయం చేయాలి

– గంధ మల్ల బాలయ్య

రామన్నపేట అక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గంధ మల్ల బాలయ్య డిమాండ్ చేశారు.రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీని స్వాగతిస్తున్నప్పటికీ, కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల వారీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయాలని కోరారు.ఉద్యమకారుల న్యాయమైన హక్కులను అమలు చేయాలని, ప్రతి ఉద్యమకారునికి 250 చదరపు గజాల ఇంటి స్థలం, రూ.25 వేల నెలవారీ పింఛన్, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొని కేసులు ఎదుర్కొన్నవారితో పాటు బైండోవర్ కేసులు ఎదుర్కొన్న ఉద్యమకారులను కూడా గుర్తించి వారికి న్యాయం చేయాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేకంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సాంస్కృతిక విభాగం కళాకారుల సంఘం జిల్లా కన్వీనర్ గంధ మల్ల వెంకటేశం, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకుడు రెబ్బాసు రాములు, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, సీపీఐ మండల మాజీ కార్యదర్శి గంగాపురం యాదయ్య, స్థానికం చీఫ్ ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ , మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి ఇమామ్, మద్దెగల్ల నరసింహ, కైరం కొండ సంతోష్, ఎర్ర రమేష్ గౌడ్, పెండం రవీందర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking