గుర్రం రవీందర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం
కొనియాడిన ఆర్ బి వి ఆర్ ఆర్ మాజీ కోశాధికారి కాసర్ల
కరీంనగర్ అక్షిత న్యూస్
రైతు సమస్యల పరిష్కారం కోసం గుర్రం రవీందర్ రెడ్డి ఎనలేని కృషి చేశారని, వారి సేవలు చిరస్మరణీయమని ఆర్ బి వి ఆర్ ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం మాజీ కోశాధికారి కాసర్ల మధుకర్ రెడ్డి కొనియాడారు. చొప్పదండి లోగల రెడ్డి సంఘం పంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన రవీందర్ రెడ్డి చిత్రపటానికి జిల్లా రెడ్డి సంఘం, సంఘ పరిరక్షణ కమిటీ నాయకులతో కలిసి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి వి ఆర్ ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం అడ్వైజరీ కమిటి సభ్యులు భూంపెళ్లి రాఘవ రెడ్డి, చొప్పదండి రెడ్డి సంఘం నాయకులు గుర్రం ఇంద్రసేనా రెడ్డి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గన్ను మహేందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ దారం జగన్నాథ రెడ్డి, నాయకులు గుర్రం రాజేందర్ రెడ్డి, గుర్రం శ్రీపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు.
“చొప్పదండి విండో చైర్మన్ ఇప్పకు శుభాకాంక్షలు”
ఆర్ బి వి ఆర్ ఆర్ రెడ్డి సంఘం ప్రతినిధులు
కరీంనగర్ జిల్లా చొప్పదండి సహకార పరపతి సంఘం సింగిల్ విండో చైర్మన్ గా నియామకం అయిన ఇప్ప శ్రీనివాస్ రెడ్డికి ఆర్ బి వి ఆర్ ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా మాజీ కోశాధికారి కాసర్ల మధుకర్ రెడ్డి, అడ్వైజరీ కమిటి సభ్యులు భూంపెళ్లి రాఘవ రెడ్డి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గన్ను మహేందర్ రెడ్డి, మాజీ జిల్లా జాయింట్ సెక్రెటరీ దారం జగన్నాథ రెడ్డి, నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.