ధర్మోరా జ్ఞానసేతు పాఠశాలలో కన్నులపండువగా రెడ్ డే
లోకేశ్వరం, జూలై 28 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని ధర్మోరా గ్రామ జ్ఞానసేతు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు వర్ణాలపై అవగాహన పెంపొందించేందుకు ‘రెడ్ డే’ (ఎరుపు రంగు దినోత్సవం) వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని ఎరుపు రంగు తోరణాలు, బుడగలు, విభిన్న బొమ్మలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చిన్నారులందరూ ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉత్సాహంగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఎరుపు రంగు ప్రేమ, ఉత్సాహం, శక్తి, ధైర్యానికి సంకేతమని విద్యార్థులకు వివరిస్తూ రంగుల విశిష్టతను తెలియజేశారు. చిన్నారులు తమ ఇళ్ల నుంచి తెచ్చిన యాపిల్, స్ట్రాబెర్రీ, టమోటా, దానిమ్మ తదితర పండ్లు, కూరగాయలు, బొమ్మలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం, రంగులు వేయడం (కలరింగ్), కాగితపు వస్తువుల తయారీ పోటీలు నిర్వహించగా, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అలరించాయి.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సి.హచ్. సంతోష్ కుమార్, మాట్లాడుతూ.. పసివయసులోనే పిల్లలకు రంగులు, ప్రకృతిపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆటపాటలతో కూడిన అభ్యాసనం చిన్నారుల మనస్సులో బలంగా నాటుకుపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు పాల్గొన్నారు…
