లోకేశ్వరం నూతన ఎస్సైకి ప్రజా ప్రతినిధులు ఘన సన్మానం…

లోకేశ్వరం నూతన ఎస్సైకి ప్రజా ప్రతినిధులు ఘన సన్మానం…

లోకేశ్వరం, జూలై 28 ( అక్షిత న్యూస్ ):

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అధికారికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఆయనను పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని, ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయాలని.ఆకాంక్షించారు.అనంతరం నూతన ఎస్సై ఎల్. ప్రదీప్,మాట్లాడుతూ.. మండల ప్రజల సహకారంతో శాంతిభద్రతలను కాపాడుతూ, అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతానన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో లోకేశ్వరం సర్పంచ్ ధార్వాడి కపిల్,సర్పంచుల సంఘం అధ్యక్షుడు భుజంగరావు పటేల్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరిపే శాంసుందర్,అమెరికిడ్స్ ఇన్ స్కాలర్స్’విద్యాసంస్థల చైర్మన్ అజయ్ రావు, నాయకులు రామారావు,లక్ష్మణరావు,సవీన్,అరుణ్, తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking