కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గంగుల వెంకట రాజిరెడ్డి జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గంగుల వెంకట రాజిరెడ్డి జన్మదిన వేడుకలు

– తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న రాజిరెడ్డి

రామన్నపేట అక్షిత ప్రతినిధి :

నకిరేకల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, రామన్నపేట ముద్దుబిడ్డ, యువ నాయకుడు, పల్లివాడ గ్రామ మాజీ సర్పంచ్ గంగుల వెంకట రాజిరెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేటలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన సందర్భంగా రాజిరెడ్డి ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వానలు కురిసి, రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. రామన్నపేట స్థానిక సుభాష్ సెంటర్‌లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రాజిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తూ ఆయన ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గంగుల వెంకట రాజిరెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే యువ నాయకుడని, సామాజిక సేవలో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking