తెలంగాణ చరిత్రలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఓ మైలురాయి
డీజీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ చరిత్రలోనే ఓ మైలురాయి గా నిలుస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చే ఈ భవనాన్ని ప్రారంభించుకుంటున్న ఈ రోజు రాష్ట్ర ప్రజలకు శుభదినమన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటేనే గ్లోబల్ ఇన్వెస్టిమెంట్స్ వస్తాయన్నారు. ఆ ఉద్దేశంతోనే పోలీస్ వ్యవస్థను సీఎం కేసీఆర్ పటిష్ట పరుస్తున్నారన్నారు. న్యూయార్క్ సిటీ, లండన్ సిటీ ని ఎలా మానిటర్ చేయగలుగుతున్నారో ఆ విధంగా తెలంగాణ పోలీస్ ఉండాలనే సీఎం కేసీఆర్ ఆశయం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఇలాంటి వ్యవస్థ ఇండియా లోనే కాదు ప్రపంచం లోనే ఎక్కడా లేదన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల కు జియో టాగింగ్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయయని చెప్పారు. ఈ రోజు మనం వేసిన బీజం మొత్తం గోవర్నెన్స్ లొనే ఒక్క పెద్ద మార్పును తీసుకొస్తుందన్నారు. ఇంత మంచి టెక్నాలజీ ని పోలీస్ శాఖకు అందించిన సీంఎం కేసీఆర్ కి పోలీస్ శాఖ తరుపున ధన్యవాదాలు తెలిపారు.