దేశ భక్తి ఉట్టి పడేలా… ద్విసప్తహం

*హెచ్ఐసీసీ లో ఘనంగా ప్రారంభం కానున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు*
*ఉత్సవాలను ప్రారంభించనున్న సి.ఎం కేసీఆర్*
*ఏర్పాట్లను మరోసారి పరిశీలించిన సి.ఎస్., డీజీపీ ఇతర ఉన్నతాధికారులు*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

భారత స్వతంత్ర వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించే హెచ్ఐసీసీలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు మరోసారి పరిశీలించారు. ఈనెల 8 వతేదీ నుండి 22 వ తేదీ వరకు నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమం రేపు ఉదయం 11 .30 కు హెచ్ ఐసీసీ లో జరుగనుంది. డీజీపీ మహేందర్ రెడ్డి,సి.ఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి ఈ ఏర్పాట్లను పరిశీలించారు. రేపు ఉదయం పదకొండున్నరకు ముఖ్యమంత్రిచే జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమయ్యే ఈ వేడుకలను అత్యంత ఘనంగా, దేశ భక్తి ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సి.ఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జెడ్పిటీసీ లు, ఎంపిపి లు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ప్రతి ఒక్కరికీ ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశామని తెలిపారు. జిల్లాల నుండి వచ్చే జెడ్పిటీసీ లు, ఎంపిపి లకు నేరుగా రావడానికి ప్రత్యేకంగా వాహన సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తొలుత ముఖ్యమంత్రి గారిచే జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో భాగంగా 75 వీణ కళాకారులచే దేశ భక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వతంత్ర సమర యోధులను తలుచుకునే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఫుజన్ డాన్స్ కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు భారీ స్టేజిని ఏర్పాటు చేశారు. మార్గానికి చేరుకునే అన్ని దారులను జాతీయ జండాలతో అలంకరించారు. నగరంలోని అన్ని జంక్షన్లను, ప్రభుత్వ కార్యాలయాలను విధ్యుత్ దీపాలతో అలంకరించి పండగ శోభ కలిగే విధంగా తీర్చిదిద్దారు. సి.ఎస్ తోపాటు జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర,పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానీయా, అడిషనల్ డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషల్ డీజీ అనిల్ కుమార్, *హెచ్జీ aiaహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండి నర్సింహ రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ

*8.8.2022 న HICCలో జరిగే.. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తహం ” ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు*
ఉదయం11.30.గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ప్రాంగణానికి చేరుకుంటారు.
*జాతీయ పాతాకావిష్కరణ.
*గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పుష్పమాలాంకరణ.
సాంస్కతిక కార్యక్రమాలు
*75 మంది వీణా కళాకారులచే..వీణా వాయిద్య ప్రదర్శన
*సాండ్ ఆర్ట్ ప్రదర్శన
*దేశ భక్తి ప్రబోధ నృత్య కార్యక్రమం.
*ఫుజన్ ప్రదర్శన.
*లేజర్ షో
అనంతరం…
* సి.ఎస్. చే  గత ప్రసంగం
*వజ్రోత్సవాల కమిటీ ఛైర్మెన్ డా. కేశవరావు చే ప్రారంభోపన్యాసం.
*ముఖ్యమంత్రి  ప్రసంగం.
*ఓట్ ఆఫ్ థాంక్స్

Leave A Reply

Your email address will not be published.

Breaking