*మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వతంత్రం*
*స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలందరూ బాగస్వామ్యం కావాలని పిలుపు*
*2కెఫ్రీడం రన్ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్* .
కోదాడ, అక్షిత ప్రతినిధి : ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలో ప్రభుత్వము ఆధ్వర్యంలో నిర్వహించిన టుకే ఫ్రీడం రన్ ను జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం కోటి20లక్షల మందికి జాతీయ పతాకాలు పంపిణీ చేస్తుందన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో విపక్షత,వెనుకబాటుతనం ఉంది. దాన్ని రూపుమాపాలి అరికట్టాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని అన్నారు.స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని ఆయన తెలిపారు.75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించి చూపిందని ఆయన తెలిపారు.గాంధీజీ ఉద్యమ స్ఫూర్తిని వర్తమాననికి, భావితరాలకు అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని ఆయన పేర్కొన్నారు.స్వాతంత్య్ర భారత వజ్రోత్సవం వేడుకల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మార్వో రాజేశ్వరి, ఎంపీడీవో ఇదయ్య, రూరల్ సీఐ దుర్గ ప్రసాద్, ఎస్సై శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనార్దన్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ ఉపేందర్, మైనార్టీ సెల్ పాషా, గ్రంథాలయం చైర్మన్ అంబాల వెంకట్, లింగరాజు, బెల్లంకొండ ఉపేందర్, అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, కవిత కాలేజ్ యజమాన్యం రఘు, తదితరులు పాల్గొన్నారు.