*అతనో స్ఫూర్తి శిఖరం…..*
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి : చేసేది పోలీసు ఉద్యోగం.. కానీ తబల వాయించడం, పాటలు పాడడం అతని ప్రవృత్తి.గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఆయన తబల వాయించడం నేర్చుకున్నాడు.రకరకాల శబ్దాలు ప్రదర్శిస్తూ శ్రోతలను ఆకట్టుకోవడం ఆయన ఆనవాయితీగా మారింది అతనే వాయిద్య కళాకారుడు పల్లె కిషోర్.
పల్లె కిషోర్ నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తమ్మడంలో ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు.తన తండ్రి అప్పుడప్పుడు వాయించే డప్పు వాయిద్యాలను చూసి వాయిద్యం మీద మక్కువ పెంచుకున్నాడు పల్లె కిషోర్. అటు తన వృత్తిలో ముందుడడమే కాకుండా కళా రంగంలోనూ ముందుండేవాడు కిషోర్.జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మునీర్ ఆధ్వర్యంలో సామాజిక సేవలను అందిస్తున్నారు పల్లె కిషోర్ కుమార్.అతనిలో ఉన్న సంగీత పట్టుదలను చూసి పోలీసు శాఖలో బ్యాండ్ మాస్టర్ గా పని చేయాలని సూచించారు. ప్రస్తుతం పల్లె కిషోర్ కుమార్ సూర్యాపేట జిల్లా పోలీసు బ్యాండ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
*అవార్డులు రావడం ఆనందంగా ఉంది*
తనలో ఉన్న ప్రతిభను చూసి పుడమి సాహితీ వేదిక తెలంగాణా ఆధ్వర్యంలో ‘తెలంగాణ ఆణిముత్యం’ అవార్డు రావడం ఆనందంగా ఉంది.తెలంగాణ ఆణిముత్యం అవార్డును ఈ నెల13న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ‘స్ఫూర్తి శిఖరం జాతీయ జాతీయ విశిష్ట సేవ పురస్కారం’ అందుకోబోతున్నట్లు పల్లె కిశోర్ కుమార్ తెలిపారు.