విలక్షణ నటుడు… కైకాల

*ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర*

*విలక్షణ నటుడిగా పేరొందిన ఆయన మృతి తెలుగు సినీ ఇండస్ట్రీకి,ప్రేక్షకులకు తీరని లోటు

 ఎంపీ రవిచంద్ర

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ప్రముఖ సినీ నటుడు,విలక్షణ నటుడిగా పేరొందిన కైకాల సత్యనారాయణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఆయన సుమారు 800 సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి గొప్ప నటుడిగా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారని ఎంపీ రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.ఆయన మృతి తెలుగు సినీ ఇండస్ట్రీకి,ప్రేక్షకులకు తీరని లోటన్నారు, కైకాల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ వద్దిరాజు భగవంతున్ని ప్రార్థించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking